![]() |
![]() |
.webp)
టాలీవుడ్ లో సైడ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ తనకంటూ ఒక మంచి స్థానాన్ని నిలుపుకున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమ్మ, అత్త పాత్రలతో తెలుగు ఆడియన్స్ కి ప్రగతి బాగా దగ్గరయ్యింది. ఇక ప్రగతి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఒక వైపు మూవీస్ తో పాటు మరో వైపు తన వర్కౌట్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఎక్కువ మంది ఫాన్స్ ని సంపాదించుకుంది. ప్రగతి వర్కౌట్ వీడియోలు, ఫొటోలు చూసి అంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. కరోనా టైం నుంచి కూడా ఆమె ఇలాంటి వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అందరినీ మోటివేట్ చేయడం స్టార్ట్ చేసింది.
ఐతే ఇదంతా అవసరమా అంటూ చాలామంది నిరాశపరిచారని కానీ తాను ఎంతమాత్రం బాధపడలేదంటూ కూడా తన ఇన్స్టాలో చెప్పుకొచ్చింది. అలాంటి ప్రగతి ఇప్పుడు గుంటూరు లో జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ సీనియర్, జూనియర్ కాంపిటీషన్స్ - 2024లో పాల్గొంది. ఈ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించి సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఈ వీడియోని ప్రగతి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 47 ఏళ్ళ వయసులో పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి సౌత్ ఇండియన్ ఛాంపియన్ గా నిలవడంతో అంతా షాకయ్యారు. ఆమె సాధించిన విజయానికి అందరూ విషెస్ చెప్తున్నారు. ఇక ఝాన్సీ, షానూర్ సన అందరూ కూడా ప్రగతి సాధించిన విజయానికి మురిసిపోతున్నారు. ఎంతో మంది మహిళలకు గొప్ప ఇన్స్పిరేషన్ గా నిలిచారు అంటూ పొగిడేస్తున్నారు నెటిజన్స్ .
![]() |
![]() |